కోయిల గానం ఆనందమే
కలువల మౌనం ఆనందమే
కురిసే మిన్ను ఆనందమే
మురిసే మన్ను ఆనందమే !
చూసే మనసుంటే.. ప్రతి మనిషి దైవమే
భువియే కాదా.. నిజమైన స్వర్గమే!
ఇహo ఆనందమే.. పరమానందమే
అహమే వీడితే.. బ్రతుకు సుమగంధమే
ఆనందమానందమే.. పరమానందమే
ప్రతి మనసందు నిండాలి మకరందమే !
దయ గల హృదయమే మందిరమే
మన్నించే మనసెంతో సుందరమే
ప్రేమతో పిలిచితే ప్రార్థనే
ఆకలే తీర్చితే ఆరాధనే
జపములు తాపములు తెలియకున్నా
మౌనము కూడా సాధనే
భ్రమలను ఒకటొకటి వీడితే
చివరకు మిగిలేది జ్ఞానమే
ధ్యాసతో చేసేది ఏదైనా జ్ఞానమే
తన్మయమయు చేయు దేదైనా యోగమే
ఇహo ఆనందమే.. పరమానందమే
అహమే వీడితే.. బ్రతుకు సుమగంధమే
ఆనందమానందమే.. పరమానందమే
ప్రతి మనసందు నిండాలి మకరందమే !