Tuesday, September 19, 2017

మనసున మల్లెల మాలలూగెనే

......................................................................................................................
 పడుకునే ముందు ఈ పాట పెట్టుకు ని వింటే  ఎప్పుడు నిద్రలోకి జారుకుంటామో తెలియనంతటి సుతిమెత్తటి అనుభూతిని, హాయిని, ఆనందాన్ని  అందించే పాట ఇది.


మనసున మల్లెల మాలలూగెనే ... 
కన్నుల వెన్నెల డోలా లూగెనే 

ఎంత హాయి ..ఈ రేయి నిండెనో ... 
ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో ....!!

కొమ్మల గువ్వలు గుసగుసమనినా 
రెమ్మల గాలులు ఉసు రుసు రనినా .... 

అలలు కొలనులో గల గల మనినా .... 
దవ్వుల వేణువు సవ్వడి  వినినా ....  

నీవు వచ్చేవని నీ పిలుపే విని...
కన్నుల నీరిడి కలయ చూచితిని....

గడియ యేని ఇక విడిచిపోకుమా ...
ఎగిసిన హృదయము పగులనీకుమా....

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో....
ఎంత హాయి ఈ రేయి నిండెనో....


https://www.youtube.com/watch?v=_RGC_lAgunY

Wednesday, July 19, 2017

ఐడియా

ఒక ఐడియా !!

ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో 5 గురు ఫ్రెండ్స్ ఉంటారు . ఇద్దరు అమ్మాయిలు , ముగ్గురు అబ్బాయిలు !!

ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతూ ఉంటారు ! చదువు పై శ్రద్ధ లేకుండా...అల్లరి చిల్లరగా తిరుగుతుంటారు . తల్లితండ్రుల డబ్బును, ఫేమ్ ను వాడుకొంటూ బాధ్యత లేకుండా జీవితాన్ని వెల్లబుచ్చుతూ ఉంటారు !

ఫైనల్ ఇయర్ మొదటి సెమిస్టర్ ిన తర్వాతా అందరూ...ప్రాజెక్ట్ వర్క్  ఎక్కడ చేయాలా అని చూస్తూ  ఉంటే ...వీళ్ళు ప్రాజెక్ట్ కోసమని డబ్బులు తీస్కొని ఎవరికీ చెప్పకుండా గోవా టూర్ కి వెళ్లి బీభత్సంగా ఎంజాయ్ చేస్తుంటారు !! ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పేరెంట్స్ కి తెలుస్తోంది !! పేరెంట్స్ వీళ్ళకి కాల్ చేసి..అసలు ఇంటికి రావొద్దని ..మాకు సంబంధం లేదని తెగేసి చెప్పేస్తారు !!

ఆన్ ది వే బ్యాక్..... ఈ ఐదుగురు స్నేహితులను ఒక క్రిమినల్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది!!

ఆ తరవాత ...ఏమైంది?


Monday, May 29, 2017

శుభరాత్రి !!

అలసిన కనులకు విశ్రాంతినిస్తూ ......
కనురెప్పల విరహానికి స్వస్తి పలికి ...

కనుల వెనుక దాగియున్న అందమైన
కలల ప్రపంచ విహరానికి రా రమ్మని ఆహ్వానిస్తూ ...... !

మల్లెల స్వాగత మాలలు పరిచి ..... మేఘాలు !!
మురిసి మెరుస్తూ.... తళుకు బెళుకుల తారలు !!
చల్లని శ్వేత  వెన్నల ప్రసరించి .... చందమామ !!
వేచి చూస్తున్నాయి....నేస్తం !!

ఇక ఈ రోజుకి సెలవు తీసుకొని ....
అమరమైన ఆ స్వప్న లోక సందర్శనకు
సిద్ధమవుదామా ..... మిత్రమా!!
శుభరాత్రి !!

డోంట్ గివ్ అప్ !!

డోంట్ గివ్  అప్ !!

నీవు ..ఎంతగానో అభిమానించే వాళ్ళే .... ఆరాధించేవాళ్లే ....
నిన్ను అలుసుగా తీసుకొన్నప్పుడు ..... డోంట్ గివ్  అప్ !!

నీవు ఎవరైతే ... అన్ని తానే అని బ్రతుకుతున్నావో ...
వాళ్లే .. నీ బలహీనతను పరిహాసం చేస్తుంటే ...... డోంట్ గివ్  అప్ !!

నీవు... తోడు నీడ అండ అని భావించే వాళ్లే ....
ప్రేమ , స్నేహం , బంధాలను అపహాస్యం చేస్తుంటే.....  డోంట్ గివ్  అప్ !!

నీవు పెట్టుకున్న ...ఇన్నాళ్ల నమ్మకం .......
ఒక్కసారిగా .. హఠాత్తుగా ...వొమ్మవుతుంటే ... డోంట్ గివ్  అప్ !!

గుండె బద్దలై ... హృదయం ద్రవించి .....
కనులు మేఘాలై వర్షిస్తున్నా .......  డోంట్ గివ్  అప్!!

ఇంద్ర ధనుస్సుని చూడాలంటే .....
కమ్ముకొన్న కారు మబ్బులు తొలగే వరకు వేచి చూడాలి  .....!!

అలసిపోతే ..... విశ్రాంతి   తీసుకో ..... !!

డోంట్ గివ్  అప్!!

Sunday, May 28, 2017

శుభరాత్రి

నిదురించే కనులకు -
కనుపాపల అందాల చూపుల తీపి రాగాల జోల పాట !!
అదిరే ఆధారాలకు -
చిరునవ్వుల మువ్వల సందడి లాలిపాట !!
ఊపిరి నింపి ప్రాణం పోసే శ్వాశకు -
గంధపు గాలుల చల్లటి ఊయల పాట !!
కనుబొమ్మల వాకిలి పై దిద్దిన చందమామలాంటి సుందర తిలకానికి -
సౌందర్యపు వెన్నెల పాట !!
చెక్కిళ్లు ఎరుపెక్కి ముద్దులొలికే శ్వేతా మోముకి -
జాజి పూల లాలి పాట .. !!
లాలి లాలీ ...జో లాలీ !!

నిదురమ్మ ఒడికి చేరి ...సేద తీరి ..తనివితీరా ఆదమరిచి ...
ఆకాశపు అంచులకు చేరి ...మేఘాల ఊయలలోన ...వెన్నెలతో చేరి..
తారలు ఊయలలూపగా .......తీయగా హాయిగా చల్లగా ..కంటి నిండా నిదురపో ...మిత్రమా....!! శుభరాత్రి !!

శుభోదయం

మోము - మనోహర ముగ్థ శోభిత !
మేను - సుగుణ సౌందర్య లత !
మనసు - మమతల కోవెల సహిత !
పలుకు - సుమధుర కోయిల కూత !
నవ్వు - లలిత సంగీత మిళిత !

మమతా , సమతా , లోక హితా!!
సీతా ,పూజితా , ప్రేమైక దేవతా !!

శుభం !! శుభం !! శుభోదయం!!