Sunday, October 2, 2016

ఎంత లో ఎంత మార్పు ?


తీరని  దాహంతో విల విల లాడిన రిజర్వాయర్లు , చెరువులు , కుంటలు, కాలువలు.... జలసిరి తో కళకళలాడుతున్నాయి...!
ఇంకి పోయిన బావులు ఉబికి  , ఎండి పోయిన బోరులు పై పైకి  ఎగిసి.. జలకాలాడుతున్నాయి....!

రోడ్లకిరువైపులా వంగి, మౌనం దాల్చిన మొక్కలు , చెట్లు... తలెత్తుకు నిలబడి వికసిస్తున్నాయి...!
విచ్చుకోవటం మరిచిన మొగ్గలు , పలుకులు కరువైన పక్షులు ... పూల వర్షం తో  సంగీత విభావరి చేస్తున్నాయి ...!

ఎన్నాళ్ళనుంచో ఎదురు చూసినట్టు... సుదీర్ఘ వర్ష స్పర్శకు  పులకరించిన పుడమి ... మట్టి సువాసనలు వెదజల్లుతోంది..!!

సూర్యుని ప్రకాశానాన్ని ఆపుతామంటూ అడ్డంగా గుమి గూడిన మేఘాలు... అరిచి, కరిచి , కరిగి చివరకు చినుకులై రాలి మానవాళిని పరవశింపచేస్తున్నాయి  ....!! అక్కడ వోడి ...ఇక్కడ హృదయాలను గెలుస్తూనే ఉన్నాయి....!!


ఈ సమయంలోనే ....

మనసు మెచ్చిన నెచ్చలి ... నా ఆశల పల్లకి ... తెలియకుండానే దూరమవసాగింది!!

ఆ.. మాటలున్నాయి .. మాధుర్యం లేదు..
ఆ.. వూసులున్నాయి .... ఉల్లాసం లేదు..
ఆ ..కేకలున్నాయి ... కేరింతలు లేవు...
ఆ ..ఆశలున్నాయి ... ఉనికి లేదు...
ఆ... కేర్ ఉంది .... కలుపుగోలుతనం  లేదు....
మొత్తంగా ....మనిషి ఉంది... మనసు లేదు !!

ఒక మనిషిని అంతగా ఇష్టపడి, ప్రేమించి, ఆరాధించి...
తన తలపు , పలుకులతో ప్రతి నిత్యం పయనించి, జీవించి ...

ఇపుడు..
తన కోసం .... తన మాట కోసం..  వేచి చూస్తూ .. మనసును సమాధాన పరుస్తూ ...
పోగుట్టుకొన్న నమ్మకాన్ని ప్రోది చేసుకోవటం కోసం.. పాకులాడుతూ.....
ఆ ప్రయత్నం లో ... తెలియకుండానే తప్పటడుగులు వేస్తూ ... పడుతూ ..లేస్తూ
తనకై ...తన వైపే సాగుతోంది....జీవన నౌక ... దిక్కు తోచక .. నడి సంద్రాన..!!



ప్లీజ్ .. కమ్ బ్యాక్....మిత్రమా...!!
మన్నించి ..మళ్ళీ వెనక్కి రండి...!!

No comments:

Post a Comment