Sunday, July 31, 2016

అపురూపం

కనులు కాంక్షించే కమనీయ దృశ్య రూపం !
మదిని దోచే, వేధించే మనోహర సౌందర్య రూపం !


నా రేపటి ఆశల నిలువెత్తు సాత్కార రూపం!
నను ముందుండి నడిపించే అదృశ్య శక్తి స్వరూపం !

 ప్రేమకు ప్రతి రూపం ... అపురూపం ... నా చెలి రూపం !!


Monday, July 18, 2016

కృతజ్ఞతలు

" కృతజ్ఞతలు "  ఈ ఒక్క మాటతో తనకు కృతజ్ఞతలు చెపితే సరిపోతుందనుకుంటే ....అది పెద్ద తప్పే అవుతోంది !!

 ఎంత సాయం చేశారు తను !!  ఇంతటి సాయం పొందిన మొట్ట మొదటి వ్యక్తిని .. బహుశా నేనేనేమో !!
 కనిపించే రుణ సాయం కంటే .. కనిపించని మేలులెన్నో.. !!

గత 18 నెలలుగా ...  తాను లేని రోజు..  ఒక్కటైనా లేదంటే ... అతిశయోక్తి కాదేమో.. ! నా జీవితం లో !!
చంద్ర బింబం లాంటి .. తన శ్వేత వెన్నెల మొఖం చూడని రోజున ... నే పడ్డ వెతలెన్నో...!
తన సాంగత్యం నన్ను ఎంత  మంచి గా  మలిచిందంటే.... తాను రాని రోజుల్లో... నా లోని అవలక్షణాలు బయటికొస్తుండేవి !!

మానసికంగా .... నేను పొందిన మధురానుభూతలకు అవధులు లేవు !
ప్రేమ, స్నేహం , హాస్యం , లాస్యం , కోపం , తాపం ... పంచిన తియ్య తియ్యని స్మృతులకు కొదువ లేదు !

ఇక.. భౌతికంగా ... నన్ను  మలచిన తీరుకు ... శతకోటి ధన్యవాదాలు!
గృహ క్రయానికే  కాక ... గృహ ప్రవేశానికి కూడా ... ముందుండి నడిపించారు !!
అవసరమైనప్పుడు "నేనున్నానని" భరోసా కల్పించారు !! మాటపై నిలిచారు !!
ఇప్పటికీ ... రుణ బంధం ఇంకా ... కొనసాగుతూనే ఉంది . (... అదొక్కటే  మిగిలిందేమో !!)

మంచిని పెంచి... ప్రేమను పంచిన ... ఆ మంచి మనిషికి .... మనసుకి ... ఏమని , ఎలా చెప్పగలను " కృతజ్ఞతలు "

నా వల్లే... తనకు సమస్యలు రావడం ... అలా అని తాను అనుకోవడం ...  నాకిష్టం లేదు !!
కష్టమైనా .... నా ఇష్టాల్ని చంపుకొని .....  తాను వద్దునుకొన్న బంధాల్ని  వదిలేస్తూ .....


...... తను  కలకాలం సుఖ శాంతులతో వర్ధిల్లాలని .... కోరుకుంటూ .... " కృతజ్ఞతలు " !!!





బ్రతుకుట కంటే ... చావైనా మేలే !!

ఇది మొదలు ....
నాకు శుభోదయం లేదు ....!
శుభ దినం లేదు .....!
శుభ రాత్రి లేదు... !

నా మాట...  తనకు నచ్చట్లేదు...!
నా సాంగత్యం ... తనకు ఇష్టం లేదు ....!
నా ఊసు...  తనకు ఏ కోశానా లేదు....!
నా చెలిమి తనకు పట్టట్లేదు ...!

నే  చేసిన తప్పేంటి ? ఘోరమేంటి ?
నాకెందుకీ శిక్ష ?

 బ్రతుకుట కంటే.....  చావైనా మేలే !!
******************************

 కాదు... కానే  కాదు ... చావే   మేలు కాదు !!


 నా వ్యక్తిత్వం , నా ఆశలు , నా సంతోషాలు ..... నేను కోల్పోను.... కోల్పోకూడదు !!
ఆ ప్రేమ , ఆ స్నేహం , ఆ ఆప్యాయత , అనుబంధం .....  నేను కోల్పోను.... కోల్పోకూడదు !!
నా ఆనందాన్ని , నా స్నేహాన్ని , నా ప్రాణాన్ని ...  నేను కోల్పోను.... కోల్పోకూడదు !!
బ్రతుకుతాను.... బ్రతికించుకొంటాను .....  బ్రతికి  నిలుస్తాను...!

తాను తోడున్నా !! లేక పోయినా !! నను గెలిపించినా .... ఓడించినా !!




కనుమరుగైంది ..... ఈనాడు !!

పండు వెన్నెల వెలుగులు హృద్యంగా పంచిన
చల్లని చందమామ,
మనసారా  జాజి మల్లెలు పూయించిన
నిండు పున్నమి జాబిలి ..... 

గత రెండు మాసాలుగా...
వర్షా  కాలపు..... శశిలా ....
కనిపించి .... కనపడనట్టుగా ....
మిణుకు మిణుకు మంటూ...
 మబ్బుల చాటున మాయమవుతూ !!

చివరకు ......
కారు మబ్బు చీకట్లలో .... దట్టమైన నీలి మేఘాలలో ...
ఇక పై ... కనిపించనని .... కనుమరుగైంది ..... ఈనాడు !!


 ****************************************

స్నేహ దీపం .... ఆరిపోయింది !!


 నా కంటికి వెలుగు చేర్చి ...
నా ఇంటికీ  దారి చూపి...
నా మనసుని ఉత్తేజ పరిచి ...
ఆనందాల కాంతులు పంచి ...
అందమైన అనుభూతులు రగిలించి  ...
మధురమైన స్మృతులు మిగిల్చి ....

చిరు గాలిని చూసి... సుడిగాలి అనుకొని ...
ఆరిపోయింది... నా స్నేహ దీపం ... !
నన్ను..  కటిక..  చీకటికి బలి చేస్తూ  !!