నాతో నేనే లేనే ....
నా ఇంతి దర్శనార్థం... ఇంద్రలోకం వెళ్ళాను !!
వాయువునడిగా .... వరుణుడినడిగా ...!
రవినడిగా .... చంద్రుడినడిగా .... తన జాడ తెలుపమని !
మేనకే... తననుకొని ..పొరబడి ... పలకరించా !!
పూల తోటలన్నీ ....తిరిగా ... తన పరిమళం ...సోకగా !
చుక్కలన్ని చూశా .... తన వెలుగు పరచగా !
సెలయేళ్ళు .... చుట్టి వచ్చా ... తన నవ్వుల సవ్వడవగా !!
కొండల్లో కోనల్లో ... పయనించా ... కోయిల పలుకగా !
వర్షంలో వేచి చూశా .... మేఘాల్లో మెరుపవగా!
మయూరిని అనుసరించా ... కాలి అందెల చప్పుడవగా !
వెన్నెలింటికెళ్లా ... మబ్బులెక్కి .... తెల్లని చల్లదనం పారగా !
జాబిల్లిననుమానించా ... దాచిందని .. తన కన్నా బావుందని !!
కనిపించని నా దేవి కోసం ... కలల రాజ్యమంత తిరిగాను !!
కనపడక ... కుదుటపడక ..... ఎటో .... ఏ వైపో .... !!
ఒంటరిగా ఎటో ... ఏ వైపో ... వెళ్తున్నా !
నన్నే రారమ్మన్న .... తెలియని రేపటిలో ...
ఏదో... ఎద గోడు ...తీర్చుకుంటూ ... వెతుక్కుంటూ .... నా కను పాప తను కోరగా !!
***********************************************************

No comments:
Post a Comment