హృదయ ఎడారిలో గల గల పారే సెలయేరా !!
మది కొలనులో వికసించిన పద్మమా !!
గుండె కోవెలలో కొలువుదీరిన దేవతా !!
నా బాధల చీకట్లలో వెన్నెల దీపమా !!
నా ఆనందాల వెలుగులో ప్రకాశించే సితారా !!
దిశ లేని నా పయనానికి గమ్యం చూపే దిక్సూచా !!
మూగబోయిన నా గొంతులో మాటల రాసుల మంత్రమా !!
నా నిరాశా , నిస్పృహ ల... భయమా !!
నా ఆశల... రుతుపవనమా !!
నా కనుల .. రూపమా ! ఆకాశమా !!
నా సంతోషాల.. స్వర్గమా ! సర్వస్వమా !!
నా కలల సామ్రాజ్యమా !!
నా గుండె ధైర్యమా !! జీవమా !! మిత్రమా !!!
స్వాగతం! సుస్వాగతం !!
No comments:
Post a Comment