Friday, December 2, 2016

పిచ్చి మనసు

సాయంత్రం అలసటతో ఇంటికొచ్చి కాసేపు పడుకొని లేచాక....ఎదో మైకంలో ...ఇలా అనిపించింది!!

తనని గట్టిగా గుండెకు హత్తుకొని  అన్ని మాట్లాడి ...మనసులోని భారమంతా దించేసుకోవాలని,
ఆ కౌగిలిలో ....తన్మయత్వంతో పరవశించి ....తనవితీరా సేద తీరాలని ...!!

కానీ .... వద్దు...!!
తను ... కనీసం.. స్నేహ ధర్మం పాటించలేదు ...!! నచ్చ లేదు...నాకు..!!
నా బాధలో ..నా  గోలలో .. నా సమస్యలో .. తోడుండక పోగా ... నన్ను దూరం చేసింది !!
ఎవరో ఎదో అనుకుంటారని కాబోలు....!! స్నేహ హస్తం అందించాల్సిన ...సమయంలో ...అవసరంలో,
తన  స్వార్థం చూసుకొంది!! నన్ను అచేతనుణ్ణి చేసి....!!
ఇంకా ..ఆ స్నేహానికి అర్థం ..ఏముంది?? అవసరం లో ..ముందు వెనుకలు చూసే స్నేహానికి విలువెంత ???
అదే నన్ను  ... బాధించింది !!ఇంకా.. బాధిస్తోంది !!

అయినా... పిచ్చి మనసు...తన వైపే చూస్తోంది...!!
తననే కోరుకొంటోంది ....కావాలంటోంది...!! తను లేకపోతే ...అంత శూన్యం అంటోంది...!!

ఇది ..అసలు తనకు అర్థమవుతుందా...!! ఎప్పటికైనా...!!
పట్టుకోవడం..పట్టుకొని ఉండటం ...గొప్ప  !!
విడవటం ...వదిలేయడం ..చాల సులువు !!
ఆంక్షల పేరుతో...ఎవరన్నారనో...ఎదో ...అనుకొంటారనో ....ఇలా చేయడం ...నాకు విపరీతమైన ...బాధను కలిగిస్తోంది...!! ఎంత వద్దనుకున్నా ...నా వల్ల కావట్లేదు...!!

అందుకేనేమో...పిల్లాడిలా ...తన ఓదార్పు కోసం ...

తనని గట్టిగా గుండెకు హత్తుకొని మాట్లాడి ...మనసులోని భారమంతా దించేసుకోవాలని,
ఆ కౌగిలిలో ....తన్మయత్వంతో పరవశించి ....తనవితీరా సేద తీరాలని ...!!
ఈ పిచ్చి మనసు ఆశ...!!

Monday, November 7, 2016

శుభరాత్రి

పక్షులు ఇంటికి చేరాయమ్మ...
గువ్వల గుస గుస లాగాయమ్మ ....
సూర్యుడు సైతం...కనుమరుగయ్యాడమ్మా...

అలసిన తనువుకు... ఆలంబనగా..
 సోలిన మనసుకు... ఆచ్చాదనగా....
 వాలిన కన్నులకు ... అపూరపంగా .....
 నిరంతర .. కార్యాలకు ఇక కళ్లెం వేసి...

ఇదిగో......ఇప్పుడే ...ఇక్కడే ....

నింగిని పానుపు చేసుకొని....
మబ్బుల దుప్పటి కప్పుకొని...
చంద్రుడు చల్లని వెన్నెల పంచగా ...
తారలు సైతం చెంతన చేరగా ....
హాయిగా మదిలో.... పవళించమ్మా.....నిండుగా మనసున...  నిదురోవమ్మా ....కమ్మగా  కలలో  విహరించమ్మ ...!!
శుభరాత్రి 

Sunday, November 6, 2016

ఓ రంగుల వన్నెల చిలుకా

ఓ రంగుల వన్నెల చిలుకా .... చూడే నీ వెనక
అలుపంటూ లేని .... ఈ అల్లరి పిల్లాడి నడకా...!!

ఓ బంగారు మేను తళుకా ....చుట్టూ ఏమి కానకా
ఎక్కడికే ఆ అడుగుల...  చప్పుడు వినక .....!!

ఓ సారి ఇటు చూడే ...పాపం పసివాడే
నీ చూపుల కోసం వేచి ఉన్నాడే...!!

అన్ని వదిలేసి నిన్నే వలచాడే
నీ తలపుల్లో ...నిదురే మరచాడే .....!!

ఎవరేమనుకున్నా ...తానేమనుకోడే
అంతగా నీకై మైమరపు అయ్యాడే ....!!

నిన్నందరికంటే మిన్నగా చూస్తాడే
నిన్నెవరేమన్నా... చూస్తూ కూర్చోడే...!!

గుండె తలుపుల్ని ...తెరిచే ఉంచాడే ...
దేవత నువ్వంటూ ...భక్తుడు అయ్యాడే ....!!

Wednesday, October 19, 2016

ఈ రోజు... నా రోజు ...కానే కాదు... !!

ఈ రోజు ని ...నా .... జీవితంలో మర్చిపోలేను !!

ఇన్నాళ్లు....  !!

దేనికోసమైతే ఆశగా ఎదురు చూస్తూ బ్రతుకుతున్నానో ....
ఎక్కడ ఇదే  నా ఆనందం అని  తాపత్రయ పడ్డానో ...
నన్ను నేను మరిచి... ఎంతలా తనే లోకమనుకొన్నానో ....
ఎవరి ఆలోచనలతో... ఈ రోజులన్నీ గడిపానో ....
ఎవరు లేకపోతే ...నేను లేనే .. లేననుకొన్నానో...
....
.....
.....

తనే ...

నువ్వొక... మామూలు మనిషివి... అందరి లాగా ...
నీవేం గొప్ప... అందరూ అంతే కదా... !

ఒకనాడు... ఏమిటీ సంబంధం అని మురిసిన వాళ్ళే ...
ఇప్పుడు ఎందుకీ సంబంధం ... ??

ఆ నాడు.. తోడు - నీడ ని ... చెలిమి- కలిమని ...
ఈనాడు ... అవన్ని కల్లలే ..

అని అంటుంటే ....

గుండె పగిలి ... ఎన్నెన్ని .. ముక్కలవుతుందో... తెలియట్లేదు !!
కళ్ళు వెచ్చని నెత్తురు చూపులతో .... సగం సగం మూసుకుపోతన్నాయి !!


నా చిన్ని సీతా కొక చిలుక ....చచ్చి పోయింది !! లేదు...  చంప బడింది !!
ఇక రాదు.... !! కనపడదు ....!! జీవితాంతం....  !!

ఈ రోజు... నా రోజు ...కానే కాదు... !!
 .




Sunday, October 2, 2016

ఎంత లో ఎంత మార్పు ?


తీరని  దాహంతో విల విల లాడిన రిజర్వాయర్లు , చెరువులు , కుంటలు, కాలువలు.... జలసిరి తో కళకళలాడుతున్నాయి...!
ఇంకి పోయిన బావులు ఉబికి  , ఎండి పోయిన బోరులు పై పైకి  ఎగిసి.. జలకాలాడుతున్నాయి....!

రోడ్లకిరువైపులా వంగి, మౌనం దాల్చిన మొక్కలు , చెట్లు... తలెత్తుకు నిలబడి వికసిస్తున్నాయి...!
విచ్చుకోవటం మరిచిన మొగ్గలు , పలుకులు కరువైన పక్షులు ... పూల వర్షం తో  సంగీత విభావరి చేస్తున్నాయి ...!

ఎన్నాళ్ళనుంచో ఎదురు చూసినట్టు... సుదీర్ఘ వర్ష స్పర్శకు  పులకరించిన పుడమి ... మట్టి సువాసనలు వెదజల్లుతోంది..!!

సూర్యుని ప్రకాశానాన్ని ఆపుతామంటూ అడ్డంగా గుమి గూడిన మేఘాలు... అరిచి, కరిచి , కరిగి చివరకు చినుకులై రాలి మానవాళిని పరవశింపచేస్తున్నాయి  ....!! అక్కడ వోడి ...ఇక్కడ హృదయాలను గెలుస్తూనే ఉన్నాయి....!!


ఈ సమయంలోనే ....

మనసు మెచ్చిన నెచ్చలి ... నా ఆశల పల్లకి ... తెలియకుండానే దూరమవసాగింది!!

ఆ.. మాటలున్నాయి .. మాధుర్యం లేదు..
ఆ.. వూసులున్నాయి .... ఉల్లాసం లేదు..
ఆ ..కేకలున్నాయి ... కేరింతలు లేవు...
ఆ ..ఆశలున్నాయి ... ఉనికి లేదు...
ఆ... కేర్ ఉంది .... కలుపుగోలుతనం  లేదు....
మొత్తంగా ....మనిషి ఉంది... మనసు లేదు !!

ఒక మనిషిని అంతగా ఇష్టపడి, ప్రేమించి, ఆరాధించి...
తన తలపు , పలుకులతో ప్రతి నిత్యం పయనించి, జీవించి ...

ఇపుడు..
తన కోసం .... తన మాట కోసం..  వేచి చూస్తూ .. మనసును సమాధాన పరుస్తూ ...
పోగుట్టుకొన్న నమ్మకాన్ని ప్రోది చేసుకోవటం కోసం.. పాకులాడుతూ.....
ఆ ప్రయత్నం లో ... తెలియకుండానే తప్పటడుగులు వేస్తూ ... పడుతూ ..లేస్తూ
తనకై ...తన వైపే సాగుతోంది....జీవన నౌక ... దిక్కు తోచక .. నడి సంద్రాన..!!



ప్లీజ్ .. కమ్ బ్యాక్....మిత్రమా...!!
మన్నించి ..మళ్ళీ వెనక్కి రండి...!!

Friday, September 23, 2016

కన్నీళ్లే ఇక మిగిలెను నేస్తం !

కన్నీళ్లే ఇక మిగిలెను నేస్తం !
నువ్వులేని ఈ లోకం శూన్యం !

************************


జరిగిన దానంతటికి కారణం ఏమిటా అని ఆలోచిస్తుంటే ....
నాకు స్పష్టంగా తెలుస్తున్నదేమిటంటే ....

"తనపై నాకున్న విపరీతమైన పిచ్చే అని "

తనేం చేసినా పిచ్చే!!  ఎక్కడ దూరమవుద్దోనన్న ... పిచ్చి ఆలోచన !!


ఆకాశమంత...  ఇష్టం..!! సముద్రమంత ... సొంతం !! భూమి....  అంత భయం !!


గుండెలు పిండే...  ఘోరమైన, భరించలేని బాధ ఏంటంటే ....
ఇప్పుడు ... నన్ను ..... తనో  పరాయి వాడిలా చూడటం...!!



పిచ్చి మనసు ...వెక్కి వెక్కి.... ఏడుస్తోంది... లోలోపల ....!!
వీడలేక... ఉండలేక... !! తనొద్దంటున్నా ....వినక !!


******************************************

Thursday, September 15, 2016

Be Happy!!

जिस पल आपकी मृत्यु हो जाती है, उसी पल से आपकी पहचान एक "बॉडी" बन जाती है।
अरे
"बॉडी" लेकर आइये,
"बॉडी" को उठाइये,
"बॉडी" को सुलाइये
ऐसे शब्दो से आपको पूकारा जाता है, वे लोग भी आपको आपके नाम से नही पुकारते ,
जिन्हे प्रभावित करने के लिये आपने अपनी पूरी जिंदगी खर्च कर दी।

इसीलिए निर्मिती" को नही
निर्माता" को  प्रभावित करने के लिये जीवन जियो।

जीवन में आने वाली हर चूनौती को स्वीकार  करें।......
अपनी पसंद की चीजों के लिये खर्चा कीजिये।......
इतना हंसिये के पेट दर्द हो जाये।....

आप कितना भी बूरा नाचते हो ,
फिर भी नाचिये।......
उस खूशी को महसूस कीजिये।......
फोटोज् के लिये पागलों वाली पोज् दीजिये।......
बिलकुल छोटे बच्चे बन जाइये ।

क्योंकि मृत्यु जिंदगी का सबसे बड़ा लॉस नहीं है।
लॉस तो वो है
के जिंदा होकर भी आपके अंदर जिंदगी जीने की आस खत्म हो चुकी है।.....

हर पल को खूशी से जीने को ही जिंदगी कहते है।
"जिंदगी है छोटी,पर" हर पल में खुश हूँ "काम में खुश हूं,"आराम में खुश हूँ ,

"आज पनीर नहीं," दाल में ही खुश हूं,
"आज गाड़ी नहीं," पैदल ही खुश हूं,

"दोस्तों का साथ नहीं," अकेला ही खुश हूं,
"आज कोई नाराज है," उसके इस अंदाज से ही खुश हूं,

"जिस को देख नहीं सकता," उसकी आवाज से ही खुश हूं,
"जिसको पा नहीं सकता," उसको सोच कर ही खुश हूं,

"बीता हुआ कल जा चुका है," उसकी मीठी याद में ही खुश हूं,
"आने वाले कल का पता नहीं," इंतजार में ही खुश हूं,

"हंसता हुआ बीत रहा है पल," आज में ही खुश हूं,
"जिंदगी है छोटी," हर पल में खुश हूं,

अगर दिल को छुआ, तो जवाब देना,
वरना बिना जवाब के भी खुश हूं..!!
Be Happy Always 😄😄

Tuesday, September 13, 2016

ఉదయించే సూర్యుని కాంతిని
ముఖమున నింపుకొని ...
 చిరునవ్వుల వెలుగులు ప్రసరిస్తూ
నా చీకట్లను పారద్రోలి ... మనసున
 పూదోటలు విరబూయిస్తున్న ప్రియ మిత్రమా ... శుభోదయం !!




రాలు రాగ పూల మాల పాడుతుండగా !!
ఈ వేళ సంధ్య సన్నజాజి పాట పాడగా !!
మాటలాడే మౌన రాగం...  మాటలాడగా !!
ఈ వేచి చూపు చూసే కళ్ళు...  వేచి ఉండగా !!

Friday, September 2, 2016

Missing You






నిన్ను మిస్సయినప్పుడు ...ఇంతకంటే ఇంకో వ్యాపకం లేదు నాకు !!

మిత్రమా.... ఎందుకు ఇంతగా ...కలవరపడుతుంది మనసు !!
నీవు కనిపించక పోతే ... మాటలాడక పోతే .... ఇంకో ప్రపంచం లేదా...  నాకు...!!
నా మనసనే ప్రపంచంలో ... నీవు తప్ప ఇంకెవరూ లేనే లేరా !!
ఎందుకిలా చేసావు ..... మిత్రమా !

 


Tuesday, August 30, 2016

Keep Walking!!

ఇప్పటిదాకా ... పెద్ద  గొడవ !!
 అసల ...తను..  రానంటాడు! .... నా వల్ల కాదంటాడు.. !!
నాకూ  మనసుంది.. !! దానికి ఆశలు , కోరికలు ఉన్నాయి !!
నా జీవితమంతా పరుల కోసమేనా... !! నాకంటూ ఏమీ వద్దా.. అని తెగ గొడవ..!
నాకూ ... మోటివేషన్ ..బలంగా కావాలంటాడు ... !!

ఎంత బ్రతిమాలాను ....!!
నీవు రాకపోతే ...మేమంతా ఏమయిపోవాలి ...!
ఈ జీవ రాశులకు దిక్కేది !!
నీవు ఒక పూట కనిపించక పోతేనే .....రక రకాల ఇబ్బందులు ...ఎన్నో అమరికలు ... ప్రత్యామ్నాయాలు ...
మాయందు దయ ఉంచి... ఉదయించమని ... అన్ని విధాలుగా.. ప్రయత్నించాను ... !!
లేదు ...!! ససేమిరా ... అన్నాడు!! నిష్ఠూరంగా !!
ఇక ...మావి చీకటి బ్రతుకులే... !! వెలుగు లేదని... దుఃఖిస్తుండగా... !!
మెరుపు లాంటి ఒక ఆలోచన...  చటుక్కున...తట్టింది !!

తనకు మోటివేషన్ కావాలి... !! నాకు వెంటనే... మోటివేషన్... స్ఫురించింది... !!
*********************************************************


నీకు మోటివేషన్ ( ప్రేరణ ) కావాలి ...అంతే కదా !!
ఐతే ... నీ అలక మాని , రోజూ లాగే ... తూర్పు దిక్కు నుంచి ...
నీ కిరణ కాంతులను ... సమస్త కోటికి .. జీవాహారంగా .. ప్రసరిస్తూ...
ఒక సారి... దక్షిణ భారతావని లోని ... నాలుగొందల ఏళ్ళు చరిత్ర కలిగిన తెలుగు నగరాన్ని ..
పరికించి చూడు ....!!

నీ సప్త వర్ణ  కిరణాల వెలుగులో ....
తన బంగారు వన్నెలకు మరింత శోభ రాగ...
సిరులొలుకుతూ ... సిగను పైకెత్తి ..
ప్రశాంత వదనంతో... చిరునవ్వులు చిలికిస్తూ ...
హంసలా నడుస్తున్నా...  నలభయ్యేళ్ళ  నవ యువతి....
మీ దైవ లోక .. నారీ మణులకేమాత్రం ...తగ్గని ...అందంతో ... ఆత్మ విశ్వాసంతో ...
తిరుగాడుచుండటను కనులారా ... కంటావు ...!!

తనను ... దర్శించి ...అస్తమించడం మాత్రం  ... మరువద్దే !!
లేదంటే .. చందమామ ...అలగొచ్చు... !!

..... ఇలా చెప్పానో లేదో .... వెంటనే ...  అలక పాన్పు దిగి... తూర్పు దిక్కుగా ..పయనమయ్యే... నా సూర్య మిత్రుడు  !!
                                           *********************


కావున ,  ప్రియ చెలియా ...!!
లోక కల్యాణ నిమిత్తం ... సకల ప్రాణ కోటి బాగు కోసం ....
సమస్త ప్రకృతి నిమిత్తం .... జన జీవనం కోసం ...
ప్రతి ఉదయం... .. ప్రకృతి ఒడిలో.. కాసేపు ... పాద యాత్ర... చేయకూడదూ ....!!








Friday, August 19, 2016

థాంక్ యూ ! మిత్రమా!

నువ్వు ఎప్పటికీ నన్ను జాగ్రత్తగా చూసుకునే మరియు నేను వెళ్లే మార్గాన్ని సులభం చేసే ఉత్తమ స్నేహితురాలివి. నేను ప్రపంచమంతా వెతికినా కూడా నీ కన్నా మంచి స్నేహితురాలు ఉండదు. నీకు ఎప్పటికీ జీవితం యొక్క ఉత్తమమైన వాటినే  ఆశిస్తాను.

 నీ లాంటి స్నేహితురాలిని పొందినందుకు నేను వరాలతో, సంపదతో దీవించబడినట్టుగా అనుకుంటున్నాను.

నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు, నేను భయపడి ఉన్నప్పుడు నువ్వు నన్ను సురక్షితంగా అనుభూతి చెందేలా చేసావు.


నేను ఏదైనా చెప్పే లోపే నువ్వు అర్థం చేసుకుంటావు. మనది రోజురోజుకి బలపడుతూ ఉండే అపురూప బంధం.


నువ్వే నా ఉత్తమ స్నేహితురాలివి . నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నా వెనుక నిలబడ్డావు. నేను నిరుత్సాహంలో ఉన్నప్పుడు నన్ను ఆనందపరిచావు.


ఈ కృష్ణా పుష్కరాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి! ఈ మహానుభూతినుండి ఇంకా తేరుకోలేకున్నాను!
థాంక్ యూ ! మిత్రమా! ఇంతటి ఆనందాన్ని, అనుభూతిని మనసారా పొందు  పరిచినందుకు!

ఈ  రోజు, నేను నిన్ను మిస్సవుతున్నాను.

Wednesday, August 17, 2016

నువ్వే శ్రేష్టం!

ప్రణామం ప్రణామం ప్రణామం !
ప్రభాత సూర్యునికి ప్రణామం!!

ప్రణామం ప్రణామం ప్రణామం !
సమస్త ప్రకృతికి  ప్రణామం !!

ఉషోదయం, నవోదయం, పూర్ణోదయం!
ప్రియమైన చెలిమికి శుభోదయం !!

మిత్రం సుమిత్రం .. నువ్వే నా సమస్తం !!
గాత్రం, స్తోత్రం, కవిత్వం .. నీకే  పరిమితం!!

నీవే నా ఇష్టం,జ్యేష్టం ... లేదంటేనే  కష్టం !!
ఈ సృష్టిలో, నా దృష్టిలో .. నువ్వే శ్రేష్టం!

ప్రియమైన మిత్రునికి శుభరాత్రి !!


Tuesday, August 16, 2016

నిన్నే తాకుతోంది

నేను కళ్ళకు గంతలు కట్టుకొని ...
మనసు అనే విల్లును ఎక్కుపెట్టి ..
తలపు అనే బాణాన్ని ఏ  దిశలో విసిరినా ...
అది అస్తమానం .. నిన్నే తాకుతోంది ....!
ఆ తలపులను మరింత మధురంగా,  మార్చి.. తిరిగి  నా దరికి చేరువ చేయవా... మిత్రమా !!

Thursday, August 11, 2016

నా దేవత


సమస్యా నాదే ! బాధా నాదే ...!
తన తప్పు, ప్రమేయం లేనే లేదే !
కోపం నాదే ! తాపం నాదే .. !
కడలిలా ఉప్పొంగే కన్నీరు నాదే !

మనసూ నాదే .. కోరిక నాదే !
కొలువుండే ఇంతి  నీవు కాక ఇంకెవరూ  లేరే !
 గమ్యం నాదే ! బాటా నాదే .. !
 దారి చూపిన దేవత నీవే !

 ఇప్పటికీ .. ఎప్పటికీ .. తనే ... నా దేవత !
మాట్లాడినా , మాట్లాడకపోయినా ... !
పట్టించుకొన్నా.. పట్టించుకోకపోయినా ...!
సదా .. తన చెలిమికి, ప్రేమకు   కృతజ్ఞతా పాత్రుడనే ... !




బంగారం

పద్మ వ్యూహం లాంటి హైదరాబాద్ ట్రాఫిక్ ని  ఛేదించుకొని ఇంటికొచ్చేసరికి  రాత్రి తొమ్మిదయింది . భోజనం ముగించుకొని కాసేపు నడుద్దామని క్రిందికి వచ్చిన నన్ను..   చల్లని చిరుగాలి  హాయిగా  తాకి , పలకరించింది.  సాయంత్రం నుండి  కురిసిన  వర్షానికి పులకరించిన పుడమి , పరవశించిన మొక్కలు , చెట్లు  మంచి సుగంధాలను  వెదజల్లుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదిస్తూ  సేద తీరుతూ  నడుస్తున్న నాకు అన్యమనస్కంగా  నా మిత్రుడు  వాసు  స్ఫురణకు వచ్చాడు . వారం క్రితం ఫోన్ చేసి మాటలాడిన దగ్గర్నుంచి వాడు ఏదో రకంగా నా మదిలో మెదులుతూనే ఉన్నాడు!
    
ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని , ఈ ఇబ్బందులు కొత్తవి కాక పోయినా,  వీటి వలన ఆరోగ్యం దెబ్బ తింటోందనీ , సరిగ్గా నిద్ర పట్టడం లేదని...   ఈ సంకట స్థితి నుండి బయటిపడాలంటే దాదాపుగా ఐదు లక్షల పై దాకా అవసరమవుతోందని.. వీలుంటే ఎంతోకంత  సర్దుబాటు చేయమని.. ఓ ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పి..  ఫోన్ పెట్టేసాడు !

దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ఇపుడే జీవించడం నేర్చుకొంటున్న మాకు, అవసరానికి  పది వేలు సర్దడమే మహా గొప్ప విషయం. ఆ విషయం..   అదే నేపధ్యమున్న వాసు కీ  తెలుసు.  నన్ను డబ్బులు అడగటం కంటే, నాతో బాధలు చెప్పుకొని , కాస్త ఉపశమనం పొందటమే వాడి అసలు ఉద్ధేశ్యమని నాకు అర్థమయింది.  మాకు ఏదైనా పెద్ద మొత్తంలో అవసరమైతే అడిగేది సింగపూర్ లో వున్నా మిత్రుడు రాంబాబు నే ! వాడి దగ్గర మూడు లక్షల వరకు ఆర్నెల్ల క్రితమే తీసుకొన్నాడని చెప్పాడు ! 

మూడేళ్ళ క్రితం వరకు ఏ ఆర్ధిక ఇబ్బందులు లేకుండా , చాలా సంతోషంగా , హాయిగా ఉండేవాడు ! మనకంటూ ఏదైనా అస్సెట్ (ఆస్తి) ఉండాలిరా , అపుడే మనం ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా ఉండగలమని చెప్పి, సిటీ శివారులో 200 గజాల ప్లాట్ తీసుకొన్నాడు..   సగం అప్పు చేసి !
నాకు తెలిసి..  అప్పుడు మొదలయ్యాయి వాడి కష్టాలు !  పోయిన సవంత్సరం దాదాపు నలభై లక్షలు పెట్టి, బ్యాంకు లోన్ తీస్కొని రెండు గదుల ఫ్లాట్ తీసుకొన్నాడు ! నెల జీతం మొత్తం లోన్ ఈఎమ్ ఐ  లకే  పోతుంటే ఇంకా కుటుంబ పోషణకు , పిల్లల ఫీజులకు మిగిలేదేముంటుంది!
ఇంకా వాడి మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువే  ! బంధు జనం మరీను ! ఇంట్లో చుట్టాల్లేని రోజులు చాల అరుదుగా ఉంటాయి ! నెలకు 20 నుంచి 30 వేల వరకు అప్పవుంతుందననీ, కష్టంగా ఉంటుందననీ  చెప్పాడు ! పరిస్థితి బాగా దిగ జారిందని అర్థమయింది ! కష్టాల కడలిలో..  సంసార బాధ్యతలను భుజాన వేసుకొని భారంగా ఈదుతున్నాడని బాగా అవగతమైంది !

అన్నీ మెల్లగా సర్దుకుంటాయిలే !... ఆరోగ్యం చాల ముఖ్యమని , నీ మీదే పూర్తిగా ఆధారపడిన కుటుంబం బాగోగులు కూడా నీ బాధ్యత అని... నీకేమైనా ఐతే ..వాళ్ళ పరిస్థితి ఏమిటని .. జాగ్రత్తగా ఉండమని ...నేను ప్రయత్నిస్తానని .. "నారు పోసిన వాడు నీరు పోయడా"? అని ఊరడించానే తప్ప .. ఇప్పటివరకు నేను చేసిందేమి లేదు..  ! సన్నని జల్లు మళ్లీ మొదలవగా.. నడక చాలించి  పైకొచ్చాను  !!

" వాసన్నయ్యా ఇప్పటికి రెండు సార్లు ఫోన్ చేసాడు ! ఫోన్ మర్చిపోయి వెళ్ళారా ? " బుజ్జోడ్ని పడుకోబెడుతూ ... రాగానే అందుకుంది మాధవి   !
"నువ్వు మాట్లాడావా " అంటూ ఫోనందుకున్నాను ! "మీతోనే  ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు.. " అని అంటుండగానే మళ్ళీ ఫోన్ ..మ్రోగింది!

" హలో! మధు .. ఎక్కడరా !! నీకో విషయం చెప్దామని చాల సేపట్నుండి ట్రై చేస్తున్నా! " వాసు గొంతులో ఆనందం ధ్వనించింది !
"నారు పోసిన వాడు ... నీరు పోయడా ...అన్నావుగా! ఆ దేవుడు.. తన ప్రతినిధి గా ..మళ్ళీ ఆ   దేవతనే పంపించాడు  ! అప్సరసలా ఆకాశం నుండి క్రిందికి  వచ్చి , చిరునవ్వులు చిందిస్తూ  నా ఎదుట సాక్షాత్కరించి , వరాలిచ్చి తిరిగి ఆకాశయానం చేసింది . .! ప్రస్తుతానికి  నా  కష్టాలు తీరినట్టే   ... చాల హ్యాపీ గా.. ఉంది రా ఇప్పుడు! " కృతజ్ఞత తో కూడిన ఆరాధన , మనసులో బరువంతా  దిగి తేలిక పడిన భావన ... వాడి మాటల్లో కనిపిస్తోంది !!
"చాల సంతోషం ! నాక్కూడా ఆనందంగా  ఉంది .. ఇంతకీ ఎవర్రా ఆ దేవత మూర్తీ ?"  ఉత్సుకతను ఆపుకోలేక అడిగాను.. !

"అదే చెప్పాను కదా ఒకసారి ! మనం  క్రితం సారి షిర్డీ వెళ్ళినప్పుడు ... ! " అని అన్నాడు . 
ఎవర్రా నాకు గుర్తు రావట్లేదు ! ఇంతగా  సహాయం చేసే వాళ్ళు మనకెవరున్నారు? విపులంగా చెప్పు అన్నాను .

 అప్పుడు మొదలయింది నా మిత్రుని మాటల ధారా ప్రవాహం ! గల గల పారే  గంగా సెలయేరులా..  హృదంతరాళం .. పొంగి పొర్లగా ! తన్మయత్వంతో..... 

నేను మొదటగా తనను మా ఆఫీస్ కాంటీన్ లో చూశాను ! శ్వేత వెన్నెల చంద్ర బింబము వంటి ముఖము ... చల్లని కాంతులు ప్రసరిస్తుండగా .. చిరునవ్వులు చిలికిస్తూ .. నాకేసి చూసి చూడనట్టు .. చూసింది ! ఇప్పటికీ  ఆ దృశ్యం మదిలో అలానే దాగుంది ! అందం, అణుకువ మెండుగా కలిగిన ఆ  ముగ్ద మనోహరి తో ఓ రెండు రోజుల తర్వాత  కూర్చొని రెండు గంటల పాటు మాట్లాడే అవకాశం కలిగింది ! చాల ప్రశాంతంగా , ముక్కు సూటిగా , ఏ బెరుకు లేకుండా .. హుందాగా మాట్లాడారు...  ధైర్యం, తెలివి, సహనం..  అన్ని సమపాళ్లలో కలబోసిన వనిత గా  తోచారు !    ఓ ముప్పై ఏళ్ళుంటాయి ... అని అనుకొన్నా ! తర్వాత..  దాదాపు ఏడాది పాటు తను కనిపించలేదు ! తన పేరు మాత్రం అప్పుడప్పుడూ వింటూ ఉండేవాడిని !!

సరిగ్గా .. ఏడాది తర్వాత.. తను మళ్ళీ ప్రత్యక్షమయింది.  మొదట్లో పెద్దగా మాట్లాడింది ఏమీ లేదు. తన ముక్కు సూటితనం, పనిలో ఓర్పు , నేర్పు, నిజాయితీ , ఖచ్చితత్వం, ఒంటరిగా తన పని తాను చేసుకోవడం, కల్మషం లేని సూటైన మాట తీరు, హాయిగా నవ్వడం, చిలిపితనం, సిరులు కురిసే చిరునవ్వు, నన్ను నాకు తెలియకుండానే తన పట్ల ఆకర్షణ పెంచుకునేలా చేసింది. రోజూ మధ్యాహ్నం అందరం కలిసి భోంచేయడం, ఆ తరువాత కాసేపు నడుస్తూ సరదాగా మాట్లాడుకోవడం, ఇలా మెల్ల మెల్లగా... తనతో సాంగత్యం పెరుగుతూ వచ్చింది. తన అలవాట్లు , అభిరుచులు , వ్యవహారాలు, వ్యాపకాలు   నాకు  భలే నచ్చేవి !  దైవ భక్తి, పరమత సహనం, దయా గుణం మెండుగా ఉండేవి. ప్రతి శని వారం, తను ఒక అనాథాశ్రమంలో పిల్లలకు ఒక పూట ఇంగ్లీష్ పాఠాలు చెపుతూ ఉండేవారు.  అన్నీ సమకూరి  ఉండి  కూడా , చాల సాధారణంగా , ఇతరుల పట్ల ప్రేమగా  ఉండటం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేస్తూ ఉండేది. నిజాయితీగా , నిక్కచ్చిగా, సామాన్యంగా ఉండటం తననుంచే నేర్చుకున్నాను ! ఒకసారి నన్ను ఏదో కారణం చేత భయంకరంగా తిట్టారు కూడా ! భయమేసింది, రోజంతా విపరీతమైన బాధేసింది. తనను ఇబ్బంది పెట్టాలని కానీ, ఇబ్బంది పడుతుందని కానీ , అసలు ఊహించలేదు.  రాత్రంతా మధనపడి, తప్పు నాదే అని గ్రహించి, తనను మరునాడు ఏదోలా శాంత పరచగలిగాను  ! అప్పటి నుండి తన మీద ఉన్న అభిమానం క్రమంగా బల పడుతూ , అనురాగమై.. ఆరాధన  గా స్థిర పడసాగింది!  " లంచ్ కి వస్తున్నారా ?" అంటూ మొదలైన  ఎస్ ఎమ్ ఎస్ (చిన్న సందేశాలు) శుభోదయం, శుభ రాత్రి చెప్పుకోక పోతే ఎదో కోల్పోయామే..  అనే  భావన కలిగేంత దగ్గరయ్యాము  !

 నేనంటే చాల ప్రేమను కనబరిచే వారు ! నేను యూనిక్ (ఏకైక) అనేవారు ! నా నవ్వు హాయిగా ఉంటుందనే వారు ! ఏదో తెలీని తంత్రం ..అదేదో  "సాధుఇజం" నాలో ఉందనే వారు ! ఎటువంటి అమరికలు లేకుండా, రాజు- పేద భేదం లేకుండా , పుట్టు పూర్వోత్తరాలు చూడకుండా నన్ను నన్నుగా గుర్తించడం, ఇష్ట పడటం నాకు తనపై ఎనలేని ఆరాధనని కలిగించాయి ! ఒక మనిషిని  మనిషి గా చూడగలిగిన, నాకు తెలిసిన అతి కొద్ది మందిలో తను చాల ముందుంటారు ! తన సాంగత్యం నన్ను ఎంతగా ప్రభావం చేసిందంటే  .... చెడు ఆలోచనలు అసలు నా దరి చేరేవే  కావు. తను  లేనప్పుడు మాత్రం అటువంటి ఆలోచనలు వస్తూ ఉండేవి. తాను రాని రోజు నాకు ఏమీ తోచేది కాదు!

 మొదట తనే మా ఇంటికొచ్చింది వాళ్ళ బ్బాయిని తీసుకొని! మా జన్మ ధన్యంగా భావించాము! రోజంతా మాతో సరదాగా గడిపారు ! నాలోని ఆత్మ విశ్వాసాన్ని మరింతగా పెంపొందించారు! ఒకసారి మాటల్లో ..." ఏదైనా మంచి పని ముందుండి మొదలెడితే కావాల్సిన సపోర్ట్ దానికదే దొరుకుతుంది " అన్నారు ! ఇలా ఉండగా ... నేను అద్దెకుంటున్న ఫ్లాట్ అమ్మకానికి పెట్టడం జరిగింది .. ఏం చేయాలో తోచక, నాకు వేరే మార్గం లేక తల్లడిల్లుతున్న సమయంలో.... తన మాటలు గుర్తొచ్చాయి ! తను సపోర్ట్ ఉంటే ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా అని బలంగా నమ్మకం కలిగి .. 
మంచి ఫ్లాట్ చూసి , నచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను ! తర్వాత తన సపోర్ట్ కావాలని అడిగాను ! మాటిచ్చారు ! నిలబెట్టుకున్నారు ! తను ఇంత వరకు ఎవరికీ చేబదులు ఇచ్చిందే లేదట ! ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ నాకు కావాల్సిన సాయం చేసారు !ఆ రోజు తను ఆ సపోర్ట్ ఇచ్చి ఉండక పోతే ... నా సొంతింటి కల, పెర్మనంట్ అడ్రస్ ...ఇంకా కల్లలు గానే ఉండేవి! అవసరమైనంత డబ్బు ఇవ్వడమే కాకుండా, వేరొకరి చేత ఇప్పించగలిగారు ! నా ఇంటికి దారి చూపిన మార్గదర్శి ముమ్మాటికీ తనే ! నా కంటికి వెలుగు, బాట తన ప్రోత్సాహమే ! ఇంటికి దారి మాత్రమే కాదు ...ఆ గృహ  ప్రవేశానికి నన్ను నడిపించిన తీరు అమోఘం ! ఆ సహకారం విలువైనది , మరువలేనిది , మరుపురానిది! రిజిస్ట్రేషన్ అయిన మరునాడు మా  ఆనందాన్ని హెచ్చింపజేయడానికి   కుటుంబ సమేతంగా మమ్మల్ని వాళ్ళింటికి  ఆహ్వానించారు .  మాతో  రోజంతా సరదాగా , హుషారుగా గడిపి, ప్రేమాభిమానాల  వర్షం కురిపించి, మమ్ముల్ని తరింప జేశారు .  

 నా సంతోషాలే తన సంతోషాలుగా చేసుకొని , నా బాధల్ని తన బాధలుగా స్వీకరించి నన్ను పలు విధాలా ఆదుకొని , ఆనంద పరిచి .. ఎన్నో ఎన్నెన్నో  తీయని స్మృతులను జీవితం మొత్తం మననం చేసుకొనేలా అవకాశం కల్పించారు. 
 ఆ పరిచయం , చనువు , ఆప్యాయత , అనురాగం, ఆరాధన  ... ఎంత వరకు వెళ్లాయంటే ... తాను లేని రోజు ..గత 15 నెలలుగా నాలో లేనే లేదంటే అతిశయోక్తి కాదు ! అంతగా నా ప్రభావం చూపిన ఏకైక వ్యక్తి,  ఇంతగా స్నేహం పంచిన వ్యక్తి ..  నా జీవితంలో .ఇప్పటివరకు తనే అంటే అతిశయోక్తి కాదు  !   పుడుతూనే కొందరు పుణ్యం కొని తెస్తారట!   మన పుణ్యం కొద్దీ  మనకు   వరాలు ఇస్తారట ... మా కోసం వరమయ్యి  వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. 

పిల్లలు పడుకొని హాయిగా నిద్రిస్తున్నారు .  మాధవి .. ఎంతసేపు ... పడుకోవడానికి రా అంటూ .. సైగ చేసి వెళ్ళిపోయింది!  వాడి మాటల ప్రవాహానికి అడ్డు తగులుతూ .. " అవును, అప్పుడు చెప్పావు కదా ! .. ఫ్లాట్ కొనేటప్పుడు  ఎవరో మేడం చాల హెల్ప్ చేశారని ! గుర్తుంది " అన్నాను.   "అవునవును .. తనే రా మళ్ళీ " అని  చెప్ప  సాగాడు! 

 ఆ తరువాత .. ఆ స్నేహ మధురిమలను  అలా  ఆస్వాదిస్తూ .. ఆనందిస్తూ ...గడిపేస్తున్న కాలంలో ..  తను ఒక నెల రోజుల పాటు సెలవులో వెళ్లడం.. ఆ వెలితిని, ఎడబాటును  తట్టు కోలేక .. నేను కాస్త ఎక్కువ రియాక్ట్ అవ్వడం.. ఒత్తిడికి లోనవటం జరిగింది.  ఆ సమయంలో అది స్నేహ పరిధిని దాటి , మరో కోణం లో, వికసిస్తూ, విస్తారమై .. తనకు కాస్త ఇబ్బందిని కలిగించేది.  మళ్ళీ మళ్లీ   తను దూరమవడం ... నేను మరలా ఒత్తిడికి గురవడం,  చివరకు వారాంతం రెండు రోజులు కూడా ఎడబాటు గా తోచడం ... ఎటు వైపు వెళ్తున్నామో  తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి ! దాదాపుగా రెండు మూడు నెలలు ఈ సంకట స్థితి కొనసాగింది ! 

ఈ బంధం ఏమిటి ? తను రాకపోతే నాకేంటి? తాను మాట్లాడక పోతే  ఏంటి? నాకెందుకు తననే చూడాలనిపిస్తోంది ! నా మనసంతా, ధ్యాసంతా తనతోనే ఎందుకు నిండి పోయింది ? తాను రాకపోతే .. నా రోజెందుకు గడవదు ? ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు !! దేనికీ సరైన సమాధానం లేదు ! ఓ రకంగా చూస్తే ... వీటన్నింటికి సమాధానం.. పిచ్చి ! తనంటే ఏ దో తెలియని పిచ్చి !! ఎన్నో సార్లు అడిగారు.. ఏంటిదంతా? అని.  అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవద్దని !  కోపాలు , తాపాలు .. అలకలు! మళ్ళీ మాములవడం, ఆనందంగా ఉండటం .. తిరిగి మళ్ళీ చిన్ని చిన్నిగొడవలు .. అలకలు ! తర్వాత ఓదార్పు , ఇలా ఉండాలి, అలా ఉండాలి  అని అనుకోవడం.. అలవాటై పోయింది! 

ఏం జరుగుతుందో , ఎందుకు ఇలా జరుగుతుందో .. తెలిసి..  తెలియక రోజులు అలా గడిచి పోతుండేవి ! ఇదే విషయం మీద దాదాపు రెండు నెలలు..  గంటల తరబడి చర్చలు  చేసాం.. ! స్పష్టమైన స్పష్టత ఎవరికీ రాలేదు ! తనకైతే కాస్తో కూస్తో స్పష్టత ఉంది కానీ .. నాకైతే బొత్తిగా ఏమీ లేదు !

 ఈ విధంగా సతమతమవుతూ ఉంటే ...  అనవసరమైన, సంబంధం లేని, ఊహా జనితమైన లోకుల మాటలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ , లేని పోనీ ఆంక్షలు తన మీద తానే రుద్దుకొని , మధనపడుతూ , ఆనందాలను ఆవిరి చేస్తూ , నిర్జీవంగా కొంత కాలం గడిపారు తను   ! ఈ పరిస్థితి నాకు ఏ మాత్రం నచ్చలేదు . నేను  ఎంత చెప్పిన వినేది కాదు తను ! సమస్య నాకు , నీకు కాదు అనేది తన ఉద్దేశ్యం కాబోలు ! తనని అంతగా ఇష్టపడే నేను .. ఆరాధించే నేను.. తను సమస్యల్లో ఉంటే  చూడగలనా ! నేను సంతోషంగా ఉండగలనా ! ఎన్నో రకాలుగా ప్రయత్నించి ..కాస్త కుదుట పరచగలిగాను ! ఇంకా సమస్యలు లేకుండా ... ప్రశాంతంగా ఉండాలంటే యథాతథా స్థితి కొనసాగించాలని నిర్ణయించాం ! అంటే ఏది ఎక్కువ కాకూడదు అలాగే తక్కువ కాకూడదు ! అలానే కొనసాగిస్తున్నాం అని అనుకొంటున్నాం .. !!

ఈ లోగా , నా ఆర్ధిక కష్టాలు... కారు దిగి విమానమెక్కాయి! పనుల నిర్వహణ చాల కష్టం అయిపొయింది ! ఇటు ఈ మానసిక సమస్యలు ...అటు ఆ  ఆర్ధిక సమస్యలు ... మెల్లగా లోపల్నుండి .. హెల్త్ మీద ప్రభావం చూపడం ప్రారంభించి , కంటికి నిదురను , వంటికి విశ్రాంతి ని , మనసుకి ప్రశాంతతను దూరం చేసాయి ! ఆనందాల్ని  ఆవిరి చేసాయి !

ఇటువంటి విపరీత నేపధ్యం లో ... నా సొంత  ప్రయత్నాలు ఫలించని తరుణంలో.. తనే నా బాధలను పసిగట్టి .. నాకు విలువైన సలహాలిస్తూ .. 
మాములు స్థితికి రావడానికి ప్రయత్నిస్తూనే.. అసలు సమస్యను తనదైన శైలి లో ..తెలుసుకొని.. విపులంగా మాట్లాడి ..వివరించి.. మరో సారి .. నాకై .. దేవతా రూపం దాల్చి .. తన నేస్తం కష్టాలు తీర్చడానికి సంకల్పించి ... నా మనశ్శాంతి ని, సంతోషాలను , నిదురను  తిరిగి  భద్రంగా .. నా దారికి చేర్చి.. నాపై తన మమతలు, ప్రేమానురాగాలు సజీవంగా నిలిపి, నా హృదయాన్ని ద్రవింప చేసింది ! ఇంతకంటే ఏం  కోరుకుంటాం ..? 
ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో గాని.. ఈ జన్మకు నాకు దేవుడిచ్చిన ప్రత్యక్ష వరం ..ఈ .. నా దేవతే ! 
తన కోసం ఏదైనా  చేయడానికి .. ఆ దేవుడు నాకు అవకాశమివ్వాలని.. సదా వేచి యుంటాను! " 

 నా మిత్రుని పలుకుల ప్రవాహా గంగ ... ఆగింది ! బయట హోరున కురిసిన భీకర వాన కూడా  వెలిసింది ! 
"నువ్వు చాల అదృష్టవంతుడివిరా!  ఇలాంటి స్నేహ హస్తం అంది పుచ్చుకొన్నందుకు నీవు  ధన్యుడివి ,  ఎవరుంటారురా ఇలా ..ఈ కాలం లో "
అని బదులిస్తూ.. మళ్ళీ అడిగాను .. ఇంతకీ ఆ దేవతామూర్తి  పేరేంటి? మాకు దర్శన భాగ్యం ఎప్పుడని !

" తనో .  విరబూసిన మందారం ..పేరు .. మేలిమి బంగారం "

ఉంటారా.. లేటయింది కదా..! శుభ రాత్రి ..అంటూ ఫోన్ పెట్టేసాడు  ! 
ప్రతి ఒక్కరికి ఇటువంటి నేస్తం దొరికితే.. కష్టాలు వారి కను చూపు మేరకైనా రావు కదా ..అని తోచింది ! శభాష్ మిత్రమా .. మన ఫ్రెండ్ సర్కిల్ లో ..అత్యుత్తమా మిత్రత్వం మీదేరా.. మనసులో అనుకొని . ఆ బంగారం లాంటి దేవత మూర్తి కి మనస్సుమాంజలి ఘటిస్తూ.. నిదుర లోకి జారుకున్నాను... !!

******************************************************************************************

నా ప్రియ నేస్తం కోరిక పై ..  తన పుట్టినరోజు కానుకగా.. అలాగే...  ఫ్రెండ్షిప్ డే సందర్బంగా... ఈ కథ  రాసి , అంకితమివ్వాలని తలచి మొదలెట్టాను ...కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ... ఆలస్యం అయింది ! అలాగే కథ కాస్త రూపం కూడా మార్చుకొంది.   క్షమాపణలు !!
















 













Tuesday, August 2, 2016

స్వాతి చినుకు

కల్లా కపటం కానని  .....
అపకారం, హాని ఎరుగని ...
అబద్ధం , అన్యాయం పలకని....
ద్వేషం , మోసం  తెలియని ......
కల్మషం లేని.. స్వచ్ఛమైన మనసు కలిగి...
మొండి పట్టుదల , అసామాన్య ధైర్యం అలవర్చుకుని...
సముద్రమంత కరుణనను,   పుడమియంత ఓర్పును ...
 అపారమైన ప్రేమను, నిండుగా గుండెల్లో దాచుకొని ....
పున్నమి కాంతులు వెదం జల్లే ..ప్రశాంతతను ...
ముఖమున ధరించిన .... సున్నిత మనస్కురాలైన ...ఓ  ప్రియా నేస్తమా !!

ఇదిగో... నింగి కేగి... మేఘమై... ఘనీభవించి ...తదుపరి .. ద్రవించి...
స్వాతి చినుకునై .... నీ ముంగిట నిలిచి... పలుకుతున్నా ....
శుభోదయం! శుభోదయం ! శుభోదయం .... సుమిత్రమా !!








Sunday, July 31, 2016

అపురూపం

కనులు కాంక్షించే కమనీయ దృశ్య రూపం !
మదిని దోచే, వేధించే మనోహర సౌందర్య రూపం !


నా రేపటి ఆశల నిలువెత్తు సాత్కార రూపం!
నను ముందుండి నడిపించే అదృశ్య శక్తి స్వరూపం !

 ప్రేమకు ప్రతి రూపం ... అపురూపం ... నా చెలి రూపం !!


Monday, July 18, 2016

కృతజ్ఞతలు

" కృతజ్ఞతలు "  ఈ ఒక్క మాటతో తనకు కృతజ్ఞతలు చెపితే సరిపోతుందనుకుంటే ....అది పెద్ద తప్పే అవుతోంది !!

 ఎంత సాయం చేశారు తను !!  ఇంతటి సాయం పొందిన మొట్ట మొదటి వ్యక్తిని .. బహుశా నేనేనేమో !!
 కనిపించే రుణ సాయం కంటే .. కనిపించని మేలులెన్నో.. !!

గత 18 నెలలుగా ...  తాను లేని రోజు..  ఒక్కటైనా లేదంటే ... అతిశయోక్తి కాదేమో.. ! నా జీవితం లో !!
చంద్ర బింబం లాంటి .. తన శ్వేత వెన్నెల మొఖం చూడని రోజున ... నే పడ్డ వెతలెన్నో...!
తన సాంగత్యం నన్ను ఎంత  మంచి గా  మలిచిందంటే.... తాను రాని రోజుల్లో... నా లోని అవలక్షణాలు బయటికొస్తుండేవి !!

మానసికంగా .... నేను పొందిన మధురానుభూతలకు అవధులు లేవు !
ప్రేమ, స్నేహం , హాస్యం , లాస్యం , కోపం , తాపం ... పంచిన తియ్య తియ్యని స్మృతులకు కొదువ లేదు !

ఇక.. భౌతికంగా ... నన్ను  మలచిన తీరుకు ... శతకోటి ధన్యవాదాలు!
గృహ క్రయానికే  కాక ... గృహ ప్రవేశానికి కూడా ... ముందుండి నడిపించారు !!
అవసరమైనప్పుడు "నేనున్నానని" భరోసా కల్పించారు !! మాటపై నిలిచారు !!
ఇప్పటికీ ... రుణ బంధం ఇంకా ... కొనసాగుతూనే ఉంది . (... అదొక్కటే  మిగిలిందేమో !!)

మంచిని పెంచి... ప్రేమను పంచిన ... ఆ మంచి మనిషికి .... మనసుకి ... ఏమని , ఎలా చెప్పగలను " కృతజ్ఞతలు "

నా వల్లే... తనకు సమస్యలు రావడం ... అలా అని తాను అనుకోవడం ...  నాకిష్టం లేదు !!
కష్టమైనా .... నా ఇష్టాల్ని చంపుకొని .....  తాను వద్దునుకొన్న బంధాల్ని  వదిలేస్తూ .....


...... తను  కలకాలం సుఖ శాంతులతో వర్ధిల్లాలని .... కోరుకుంటూ .... " కృతజ్ఞతలు " !!!





బ్రతుకుట కంటే ... చావైనా మేలే !!

ఇది మొదలు ....
నాకు శుభోదయం లేదు ....!
శుభ దినం లేదు .....!
శుభ రాత్రి లేదు... !

నా మాట...  తనకు నచ్చట్లేదు...!
నా సాంగత్యం ... తనకు ఇష్టం లేదు ....!
నా ఊసు...  తనకు ఏ కోశానా లేదు....!
నా చెలిమి తనకు పట్టట్లేదు ...!

నే  చేసిన తప్పేంటి ? ఘోరమేంటి ?
నాకెందుకీ శిక్ష ?

 బ్రతుకుట కంటే.....  చావైనా మేలే !!
******************************

 కాదు... కానే  కాదు ... చావే   మేలు కాదు !!


 నా వ్యక్తిత్వం , నా ఆశలు , నా సంతోషాలు ..... నేను కోల్పోను.... కోల్పోకూడదు !!
ఆ ప్రేమ , ఆ స్నేహం , ఆ ఆప్యాయత , అనుబంధం .....  నేను కోల్పోను.... కోల్పోకూడదు !!
నా ఆనందాన్ని , నా స్నేహాన్ని , నా ప్రాణాన్ని ...  నేను కోల్పోను.... కోల్పోకూడదు !!
బ్రతుకుతాను.... బ్రతికించుకొంటాను .....  బ్రతికి  నిలుస్తాను...!

తాను తోడున్నా !! లేక పోయినా !! నను గెలిపించినా .... ఓడించినా !!




కనుమరుగైంది ..... ఈనాడు !!

పండు వెన్నెల వెలుగులు హృద్యంగా పంచిన
చల్లని చందమామ,
మనసారా  జాజి మల్లెలు పూయించిన
నిండు పున్నమి జాబిలి ..... 

గత రెండు మాసాలుగా...
వర్షా  కాలపు..... శశిలా ....
కనిపించి .... కనపడనట్టుగా ....
మిణుకు మిణుకు మంటూ...
 మబ్బుల చాటున మాయమవుతూ !!

చివరకు ......
కారు మబ్బు చీకట్లలో .... దట్టమైన నీలి మేఘాలలో ...
ఇక పై ... కనిపించనని .... కనుమరుగైంది ..... ఈనాడు !!


 ****************************************

స్నేహ దీపం .... ఆరిపోయింది !!


 నా కంటికి వెలుగు చేర్చి ...
నా ఇంటికీ  దారి చూపి...
నా మనసుని ఉత్తేజ పరిచి ...
ఆనందాల కాంతులు పంచి ...
అందమైన అనుభూతులు రగిలించి  ...
మధురమైన స్మృతులు మిగిల్చి ....

చిరు గాలిని చూసి... సుడిగాలి అనుకొని ...
ఆరిపోయింది... నా స్నేహ దీపం ... !
నన్ను..  కటిక..  చీకటికి బలి చేస్తూ  !!










Tuesday, June 28, 2016

శుభోదయం

హాయి గొల్పు చిరునవ్వుల చిరునామా !!
కోటి దివ్వెల వెలుగుల కాంతమా !!
మనసుని  ఇట్టే ఆకర్షించే అయస్కాంతమా !!
అందం , అణకువ విరబూసిన మందారమా !!
వెలకట్టలేని మేలిమి బంగారమా !!
నా ఎల్లల్లేని  ఆనందాల శ్రీకారమా !!

సరదాల  చిలిపితనమా  !!
చిరునవ్వు లోని మధురిమా !!
తియ్యగా పాడే కోయిల స్వరమా !!
గత జన్మల రుణ బంధమా !!
నా సంతోషాల విజయ ధరహాసమా !!

శుభోదయం !! మీకు శుభోదయం !!

నులి వెచ్చని వెలుగు రేఖనై ...
చల్లని చిరుగాలి తిమ్మెరనై .....
తీయగా పాడే కోకిల పాటనై.....
రవి స్పర్శతో పరిమళించిన ..పూల సుగంధమై ....
చెలి  తలపులతో విచ్చుకొన్న చిరునవ్వునై....

ఇదిగో.... ఇపుడే వస్తున్నా... ! ఈ ఉదయకాల శుభ వార్తనై .....!!

Tuesday, June 14, 2016

అలజడి

ఏదో... నిరాశ, అచేతనత్వం...    తెలియని అలజడి!
 కారు మబ్బులై  మనసు నిండా కమ్ముకోస్తున్నాయి!
ముసిరిన చీకట్లలో ... వెలుగు లేక...  విల విల లాడుతోంది హృదయం!   

మనసు మూగబోతోంది !! అటు ఇటు ఊగుతోంది! స్థిరత్వం లేదు !!
ఏదో కావాలంటూ ఎదురు చూస్తోంది !! వద్దు వద్దు..  అంటూ వెనక్కి వస్తోంది !!
తికమక పడుతోంది !! తిరగల తిరుగుతోంది !!

ఆశ కరువైంది !! ఉత్సాహం ఊసు లేదు !! ఆనందం అట కెక్కింది !!
ఇష్టం...  కష్టమవుతోంది ! కష్టమే...  ఇష్ట మవుతోంది !!
జీవనం యాంత్రికమవుతోంది !!

ఓ..  దైవమా ! నా మనస్సుకి  స్థిరత్వాన్ని చేకూర్చి .... సరి చెయ్యవా !!
















Sunday, June 5, 2016

స్వాగతం! సుస్వాగతం !!

మనసు   పూదోటలో  పూసిన వెలుగుల పువ్వా !!
హృదయ ఎడారిలో గల గల  పారే సెలయేరా !!
మది కొలనులో వికసించిన పద్మమా !! 
గుండె కోవెలలో కొలువుదీరిన దేవతా !!

నా బాధల చీకట్లలో వెన్నెల దీపమా !!
నా ఆనందాల వెలుగులో ప్రకాశించే సితారా !!
దిశ లేని  నా పయనానికి గమ్యం చూపే దిక్సూచా  !!
మూగబోయిన నా గొంతులో మాటల  రాసుల మంత్రమా !!

నా నిరాశా , నిస్పృహ ల...  భయమా !!
నా ఆశల...  రుతుపవనమా !!
నా కనుల .. రూపమా ! ఆకాశమా !!
నా సంతోషాల..  స్వర్గమా ! సర్వస్వమా !!

నా కలల సామ్రాజ్యమా !!
నా గుండె ధైర్యమా !! జీవమా !! మిత్రమా !!!
స్వాగతం! సుస్వాగతం !!



Wednesday, June 1, 2016

నాతో నేనే లేనే ...

నాతో నేనే లేనే ....


నా ఇంతి దర్శనార్థం...  ఇంద్రలోకం వెళ్ళాను !!
వాయువునడిగా .... వరుణుడినడిగా ...!
రవినడిగా .... చంద్రుడినడిగా  .... తన జాడ తెలుపమని !
మేనకే...  తననుకొని ..పొరబడి ... పలకరించా !!

పూల తోటలన్నీ ....తిరిగా ... తన పరిమళం ...సోకగా !
చుక్కలన్ని చూశా .... తన వెలుగు పరచగా !
సెలయేళ్ళు .... చుట్టి వచ్చా ... తన నవ్వుల సవ్వడవగా !!
కొండల్లో కోనల్లో ... పయనించా ... కోయిల పలుకగా !

వర్షంలో వేచి చూశా ....  మేఘాల్లో  మెరుపవగా!
మయూరిని అనుసరించా ... కాలి అందెల చప్పుడవగా !
వెన్నెలింటికెళ్లా ... మబ్బులెక్కి .... తెల్లని చల్లదనం పారగా !
జాబిల్లిననుమానించా ... దాచిందని ..  తన కన్నా బావుందని !!
 
కనిపించని నా  దేవి కోసం ... కలల రాజ్యమంత తిరిగాను !!
కనపడక ... కుదుటపడక ..... ఎటో .... ఏ వైపో .... !!


ఒంటరిగా ఎటో ... ఏ వైపో ... వెళ్తున్నా !
నన్నే రారమ్మన్న .... తెలియని రేపటిలో ...
ఏదో...  ఎద గోడు ...తీర్చుకుంటూ ... వెతుక్కుంటూ .... నా  కను పాప తను కోరగా !!

 ***********************************************************





జాబిల్లి కోసం ఆకాశమల్లే...

జాబిల్లి కోసం ఆకాశమల్లే...  వేచాను...  నీ రాక కై !
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను...  పాటనై!

నువ్వక్కడ నేనిక్కడ .... పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటే ... కలిసున్నది ఏనా డైనా!
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా
ఊహల్లో తేలీ...  ఉర్రూతలూగి ... మేఘాల తోటి
 రాగాల లేఖ...... నేనంపినాను రావా....  దేవి!

నీ పేరొక జపమైనది.....  నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది.....  ఎన్నాళ్ళైనా
ఉండీ లేకా వున్నది నీవే.....  ఉన్నా కూడా లేనిది నేనే!
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే.....  నీ దగ్గరున్నా నీ నీడ నాదే....
నా దన్నదంతా నీవే....  నీవే.... !

Saturday, May 28, 2016

ఒంటరి పయనం

ఒంటరిగా ....
ఒంటరిగా వేస్తున్నా .... అడుగులు...  ఎటో ....
ఎవరో పిలిచినట్టు అనిపించింది ...  ఆకస్మాత్తుగా ఆగాను !
చుట్టూ చూసాను ! చిత్రంగా !  మాటలు .. వినిపించాయి ! విచిత్రంగా !

అనుక్షణం నీ మనసులో ఆరని జ్యోతిగా వెలిగిన నీ నేస్తం ...
ఇక రాదా మిత్రమా అని అడిగిన ...
ప్రతి వీధి కొమ్మకి, రెమ్మకి ... ఏమని చెప్పను ? మౌనమే నా భాష !
ఇక ఆ వీధుల్లొ నడవకూడదనుకొన్నా ! ఉదయం పూట !

హంసను తలపించే నీ మిత్రుని అడుగులు
ఇక కనపడవా నేస్తం..  అని అడిగిన ...
ప్రతి పావురానికి , పక్షికి .... ఏమని చెప్పను ? మౌనమే నా పలుకు !
మళ్ళీ ఆ వీధుల్లొ నడవకూడదనుకొన్నా ! సాయంత్రం కూడా !

వెన్నెలను కురిపించే నీ చెలి నవ్వులు
ఇక వినపడవా మిత్రమా  .. అని అడిగిన
చందమామకు ... ఏమని చెప్పను? మౌనమే నా సమాధానం !
ఇక వెన్నెలకు దూరంగా ఉండాలనుకొన్నా !

చూపులతోనే మెరుపును మరపించే నీ నెచ్చెలి
ఇక నీ దరి చేరదా నేస్తం .. అని అడిగిన
ఆకాశ తారలకు ... ఏమని చెప్పను?  మౌనమే నా మంత్రం !
ఇక చుక్కలవైపు చూపు వెళ్ళకూడదనుకొన్నా !

గోదారి గలగలలనే...  మాటలుగా చేసుకొన్న ,
నీ మిత్రుని పలుకులు మాయమైనట్లేనా ... అని అడిగిన ...
చల్లని చిరు గాలికి .. ఏమని చెప్పను? మౌనమే నా ఘోష !
ఇక ఆ నిషా పవనాలు .. తాకనీయొద్దనుకొన్నా !

మా రంగులనే ఆనందాలుగా చేసుకొన్నా
మీ మిత్ర ద్వయం ... ఒంటరయిందే !.... అని అడిగిన
ఆ అందాల హరివిల్లుకు ..... ఏమని చెప్పను ? మౌనమే నా యత్నం !

మౌనమే.... మహా ఆభరణంగా ధరించి...  మళ్ళీ మొదలయింది నా పయనం ...
నీకై ...  నా ఒంటరి పయనం ....

ఓ తారలా మైమరచి పోతూ

ఆరు బైట, అంబరాన, వేచి వున్నా ఆకాశ తీరం ....
మెరిసే  కన్నులతో ... చూస్తోంది నా రాక కోసం ,

చీకటి దుప్పటి పరిచి,
చల్లని గాలితో  ఆహ్వానం పంపి ....

వెన్నెల పల్లకినిచ్చి ......
చిరు గాలికి  మధు రాగాలిచ్చి ,

రారమ్మని ఆశగా చూస్తూ .....
నిదురమ్మను నా వద్దకు పంపి ,

ఉహల రెక్కలు తొడిగి .....
కమ్మని కలలను కనుల వాకిటనుంచి ,

జోజోమ్మని , రారమ్మని ... తియ్య తీయగా పిలువగా ....
ఎద హాయిగా , తేలికపడి ... నిదురమ్మ ఒడిలోనా
ఒదిగి నిదుర పోగా !

కనులు వాలి, నిదుర పోయి , పల్లకి ఎక్కి , రెక్కలు తొడిగి ......
నే చేరా ... ఆ తీరం , ఓ తారలా మైమరచి పోతూ !!

ప్రియతమా !

ప్రియతమా .....  నీ తలపులోనే బ్రతికున్నా!
                  నీ ఊహలోనే ... జీవిస్తున్నా !

                  యుగంలా వుంది ఒక్కో క్షణం ...
     క్షణమే యుగంగా గడుస్తుంది ప్రతీ క్షణం !

  జాబిలిలో చూసుకొన్నాను ... నీ రూపాన్ని !
వెన్నెల కాంతులలో  ఊసులాడాను .... !!

         కలగన్నాను .... నువ్వు నా దరి చేరావని !
            కరుణించి .. నా చెలిమినందుకొన్నావని !
    పులకరించి ... పరవశించి ... మనసుని కుదుట పరిచి .... వేచి యున్నాను !!!

Thursday, May 26, 2016

నీవు లేక ..... నేను లేను


నీ తలపు లేక  ... నా  కాలం కాస్తైన  కదలదు !!
నీ చిరునవ్వు మోము చూడనిదే ... నా  రోజు  కొంచెమైన గడవదు !!
నీ పలుకు వినపడనిదే .... నా గొంతు మాట రాదు !!
నీ నవ్వుల జల్లు  లేక.... నా  జాడే  లేదు !!
నీ జవాబు రానిదే ...నా  సూర్యోదయమ కాదు !!
నీ చూపు లేక ... నా వెలుగు లేదు !!
నీ ఊసు కాక .... నాకింకేయాశ  లేదు!! 
నీవు లేక ..... నేను లేను !!
*************************************************

Tuesday, May 24, 2016

అందమైన చంద్రబింబం!

సూర్యాస్తమయం మొదలు తన చల్లని పండు వెన్నెల వెలుగులు పంచుతున్న చందమామ
అందరిని చక్కగా నిదరోపి ...  ఇక సుర్యోదయమవబోతుందని కాబోలు... ఏమి తోచక...
నాతో  వూసులాడదామని ...   వచ్చి నిదురలేపింది !!

తన రాకతో...  పులకరించి పరవశించాను!!  ఎన్నో ఊసులు , మధురమైన మాటలు ,
కమ్మని పాటలు, ఆనందాల ఆటలు ...  మనసున  పూదోటలు !
ఏవో ఊహలు .... హృదయ బాసలు ... మనసు కేరింతలు !!

అలా అలా ... సరదాగా గడిపేసి ... నాకు నిదుర దూరం చేసి ... తను మాయమయింది మబ్బుల్లోకి...  !!
ఆ అందమైన చంద్రబింబం ! మళ్ళీ వస్తానని చెప్పి !!

 *************************************************************************

Saturday, May 21, 2016

శుభరాత్రి !!

సువిశాల ఆకాశ పందిరిలో
చందమామ తన చల్లని వెన్నెల  వెలుగులు పంచగా ....
మేఘుడు తన ధవళ వర్ణ మేఘాలను మెత్తని ఊయలగా చేసి పంపగా 

వాయువు జనించిన చిరు గాలి తిమ్మెరలుకు ఊగుతున్న ఊయలపై....

అందాల హరివిల్లు పల్లకిలో... దేవకన్యలా ఏతెంచి..... ఆసీనమవగా.......
తారలన్నీ చక్కని చుక్కలై లాలీ  ... లాలీ  .... అని  జోలపాటలందుకొనెగా....

నిదురమ్మ తల్లి నిన్నావాహించి....తనలో కలుపుకొనగా.......
తేలికపడి, సెదతీరి, ఆదమరిచి.....
కలల రాజ్యానికి సామ్రాజ్ఞివై ...... కనులారా  ఏలుకొని.....
పరవశించి . ... పవళించి....
ఉప్పొంగే ... ఉత్సాహంతో ఉరకలేస్తూ .....
తొలకరి జల్లులా ..... పసిపాప నవ్వులా.... తాజాగా ...
మమ్ములను ఆనందిమ్పచేయ ......
మరో సూర్యోదయాన్ని... ఆహ్వానించు .... మిత్రమా ....

శుభరాత్రి !!